ఎన్‌సీసీ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో ప్రమాదం
భారీ ఈదురుగాలులు వీచడంతోనే..
రంగారెడ్డి జిల్లా మహాలింగాపురంలో ఘటన
నవతెలంగాణ-శంకర్‌పల్లి
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మహాలింగాపురంలో తీవ్ర విషాదం నెలకొం ది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎన్‌సీసీ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో సోమవారం భారీ ఈదురుగాలులకు క్రేన్ కూలి విధుల్లో ఉన్న ఐదుగురు కార్మికులపై పడింది. దాంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. పలువు రు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్‌సీసీ సిమెంట్ బ్రిక్స్ కంపెనీ ప్రాజెక్టులో పనులు జరుగుతుండగా.. సాయంత్రం వేళ ఒక్కసారిగా వీసిన తీవ్రగాలుల ప్రభావంతో భారీ క్రేన్ అదుపుతప్పి కూలి కూలీలపై పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు మృతి చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇతర కూలీలు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే, క్రేన్‌కు అవసరమైన భద్రతా లాకింగ్ వ్యవస్థ అమలులో ఉన్నప్పటికీ, గాలుల తీవ్రత కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు గుర్తించారు. క్రేన్ కింద ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉన్నారా.. అనే కోణంలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న కార్మికుల్లో అధికమంది ఇతర రాష్ట్రాలకు చెందినవారుగా తెలుస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని డీసీపీ, ఏసీపీ, ఎమ్మెల్యే సందర్శించారు.
క్రేన్ కూలి ఐదుగురు కూలీలు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



