14 మంది మృతి.. 37 మందికి గాయాలు
బీరుట్ : కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయిల్ బేఖాతరు చేస్తోంది. ఇజ్రాయిల్ సేనలు జరిపిన తాజా దాడులలో 14 మంది మరణించారు. 37 మంది గాయపడ్డారు. తాను ఆక్రమించిన ఏడు పట్టణాలను వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ ఇజ్రాయిల్ సైన్యం స్థానికులకు ఆదేశాలు జారీ చేస్తోంది. తాజా దాడులలో చనిపోయిన వారిలో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని హెజ్బొల్లా ఉల్లంఘిస్తోందని, అందుకే దానిపై చర్యలు తీసుకుంటున్నామని ఇజ్రాయిల్ చెబుతోంది. లితానీ నదికి ఉత్తరంగా, దక్షిణ లెబనాన్‌లోని జోన్‌లో ఉన్న పట్టణాలను ఇజ్రాయిల్ దళాలు ఆక్రమించుకొని కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ సైనిక చర్యలకు దిగుతున్నాయి. ఇజ్రాయిల్ దాడులలో ఇప్పటి వరకూ రెండున్నర వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 277 మంది మహిళలు, 177 మంది చిన్నారులు, 100 మంది వైద్య సిబ్బంది ఉన్నారు.
లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



