భారత్‌ను మరోసారి కోరిన బంగ్లాదేశ్
ఢాకా : మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాల్సిందిగా బంగ్లాదేశ్ మరోసారి భారత్‌ను కోరింది. భారత హై కమిషనర్ దినేష్ త్రివేదీ సోమవారం ఢాకాలో బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హసీనాను అప్పగించాల్సిందిగా భారత్‌కు బంగ్లాదేశ్ విజ్ఞప్తి చేసింది. ఈ సమావేశంలో అనేక ముఖ్యమైన ద్వైపాక్షిక అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయని బంగ్లాదేశ్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలియజేసింది. కాగా ప్రధాని నరేంద్ర మోడీ పంపిన అభినందన సందేశాన్ని త్రివేది అందజేశారని, బంగ్లాదేశ్ ప్రధానితో, ప్రజలతో సానుకూల, నిర్మాణాత్మక దృక్పథంలో పనిచేయాలని మోడీ ఆకాంక్షించారని భారత రాయబార కార్యాలయం సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో వివరించింది.
హసీనాను అప్పగించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



