సహజ మెరుపుకు…

పెరుగు తినడానికి మాత్రమే కాదు.. పలు రకాల చర్మ సమస్యలను పరిష్కరించడంలోనూ ఓ మ్యాజిక్‌లా పనిచేస్తుంది. మీ ముఖ చర్మం ప్రకాశవంతంగా మెరిసిపోవాలంటే ఓ సారి పెరుగు ఫేస్‌ ప్యాక్‌ను ట్రై చేయండి. ఎ చెంచా పెరుగు, ఒక అరటిపండు, రెండు చెంచాల రోజ్‌ వాటర్‌ లను కలిపి ఫేస్‌ ప్యాక్‌ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం నిగారిస్తుంది.
జిడ్డు చర్మం ఉన్నవారు.. పెరుగు రెండు చెంచాలు, తేనె చెంచా, నిమ్మకాయ రసం చెంచా చొప్పున ఓ బౌల్‌లోకి తీసుకుని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని ముఖం, మెడ భాగంలో అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత కొద్దిగా నీరు చల్లి నెమ్మదిగా రబ్‌ చేస్తూ చల్లని నీటిలో కడిగేయాలి.
పెరుగుతో తయారు చేసిన ఈ రెండు ఫేస్‌ ప్యాక్‌లను వారంలో రెండు సార్లు చేస్తూ వస్తే మొటిమలతో పాటు ముఖంపై ఉండే ఇతర మచ్చలను కూడా తగ్గిస్తుంది. కొన్ని వారాల పాటు దీన్ని ట్రై చేస్తే చర్మంపై మత కణాలు పోయి సహజ సిద్ధంగా అందంగా… ఆరోగ్యవంతంగా తయారవుతుంది.

Spread the love