మేకల మందలో కొండగొర్రె స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు

– క్షేమంగా “జూ”కు పంపించిన అటవీ శాఖ అధికారులు
– ప్రశంసించిన అటవీశాఖ అధికారులు
నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామంలో కొండ గొర్రె పిల్ల లభ్యం అయింది. వివరాల్లోకి వెళితే.. కాటాపూర్ గ్రామంలో వులు సమీపంలో మేతకు వెళ్లి తిరిగి రాగా, పశువులలో కొండగొర్రె గ్రామంలోకి వచ్చింది. అట్టి విషయాన్ని గమనించిన కనకదుర్గ హోటల్ వద్ద కూర్చున్న స్థానికులు, హోటల్ యజమాని స్థానిక ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ టెరిటోరియల్ అధికారి కోట సత్తయ్య ఆధ్వర్యంలో బీట్ ఆఫీసర్ కుడుముల బక్కయ్య, ఎఫ్ ఎస్ ఓ వజ్జ లక్ష్మీనర్సు లు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని స్వాధీనం చేసుకున్నారు. ఆ కొండ గొర్రె చిన్నపిల్ల కు “పీక” ద్వారా పాలు పెట్టి, ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వరంగల్ లో ఉన్నటువంటి జూ పార్కు కు తరలించారు. ఎలాంటి హాని చేయకుండా కొండ గొర్రె పిల్లను సురక్షితంగా అటవీ శాఖ అధికారులకు అప్పగించినందుకు హోటల్ యజమానికి, స్థానికులకు అటవీశాఖ అధికారులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్, బీట్ అధికారులు, బేస్ క్యాంప్ సిబ్బంది సునీల్, సాంబయ్య, సుక్రు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love