రైతు సంఘం ఏర్పాటు..

నవతెలంగాణ – అశ్వారావుపేట

అశ్వారావుపేట మండలం పండువారిగూడెం లో  రైతుసంఘం మండల కమిటీని మంగళవారం 10 మందితో కమిటీ ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర కమిటి సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య రైతులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. అనంతరం సభ్యత్వం చేర్పింపు ను ప్రారంభించారు.మండల కమిటి సభ్యులు గా మొడియం.దుర్గ రావు,శీసం రాము.నడింపల్లి శివరామరాజు,వూకే.బాబురావు,నారం పుల్లప్ప, మడివి లింగయ్య,శీలం నాగేశ్వరరావు లు పాల్గొన్నారు.
Spread the love