ఏబీవీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీలో చేరిక 

నవతెలంగాణ –  కామారెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలన అందిస్తూ అనేక సంక్షేమ పథకాలు తీసుకువస్తూ పేద ప్రజలకు, విద్యార్థిని విద్యార్థులకు అండగా ఉంటూ దేశంలోనే మొట్టమొదటిసారి స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి విద్యార్థుల భవిష్యత్తుకై అనేక రకాలుగా కృషి చేస్తున్నందుకు ఆకర్షితులై శుక్రవారం ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్  నాయకత్వంలో ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు ఏబీవీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ఖలీల్, పట్టణ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన సంజయ్, జిల్లా నాయకులు రాజు, కాంగ్రెస్ పార్టీ లో చేరరు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ   మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రగల్బాలు పలికి నిరుద్యోగులకు మొండి చేయి చూపించారన్నారు. మా ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 55 వేల పైచిలుకు ఉద్యోగులను నియమించమని అన్నారు. పేద ప్రజలకు, పేద విద్యార్థులకు అండగా నిలిచే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ఏబీవీపీ క చెందిన విద్యార్థి నాయకులు పార్టీలో చేరటం సంతోషదాయకమని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి విద్యార్థుల్లోకి తీసుకెళ్లాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస యు ఐ రాష్ట్ర నాయకులు ఐరన్ సందీప్ కుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలాస శ్రీనివాసరావు, యువజన పట్టణ అధ్యక్షుడు పండ్లరాజు, మాజీ జెడ్పిటిసి నిమ్మ మోహన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కొత్తిమీరకర్ కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love