మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే కు ఘనంగా సన్మానం…

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలం దళిత సంఘం నాయకుల ఆధ్వర్యంలో సోమవారం నాడు మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ను డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హనుమంత్. షిండే మాట్లాడుతూ నేను ఎమ్మెల్యే కావడానికి ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ పుణ్యమే నాకు ఈ స్థాయికి చేర్చిందని దళితుల అభ్యున్నత దైవం కావున బిఆర్ అంబేద్కర్ మహానీయుడని గొప్ప వక్తా అని రాజ్యాంగ నిర్మాణం చేసిన మహా మేధావి అని కొనియాడారు. ఈ కార్యక్రమం  లో.  జుక్కల్ మండల దళిత యువజన సంఘం అధ్యక్షుడు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అజయ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఉన్నత చదువులు చదివిన మంచి స్థాయిలో నిలబెట్టాయని తాను కూడా అందులో ఒక వ్యక్తిని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హనుమాన్ షిండే ,  సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు సురేష్ గొండ, జుక్కల్ మండల ఎస్ఎఫ్ఐ నాయకులు , దళిత యువజన సంఘం నాయకులు, మహిళలు , జిపి కార్మికులు , తదితరులు పాల్గొన్నారు.
Spread the love