చైన్ స్నాచింగ్ చేసిన నలుగురు నిందితుల అరెస్టు..

నవతెలంగాణ – ఆర్మూర్  

చైను స్నాచింగ్లు చేస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జి బస్వారెడ్డి తెలిపారు. పట్టణ ఎసిపి కార్యాలయం ఎందు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి 63 మోర్తాడ్ మండలంలోని దొన కల్ గ్రామ ఎక్స్ రోడ్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకొని వీరి వద్దనుండి 15.7 తులాల బంగారం ,ఒక పల్సర్ బైక్ ,ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్షసి పేట చంచల్గూడా కు చెందిన కారు మెకానిక్ గా పని చేసే అబ్దుల్ సాజిద్ ,ఇదే గ్రామానికి చెందిన పాతూరి తరుణ్ ,జిల్లాలోని డిచ్పల్లికి చెందిన బోయర్ శేఖర్ ,జిల్లా కేంద్రంలోని మిర్చి కాంపౌండ్ కు చెందిన సాయికుమార్ అనే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరు జిల్లాలోని మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో, మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంజర్ గ్రామంలో, బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్టాపూర్ ఆలూర్ మండలంలోని దేగాం గ్రామంలో ,లక్ష్మణ్ చందా పోలీస్ స్టేషన్ పరిధిలోని పిచారా ,జన్నారం స్టేషన్ పరిధిలోని కాలమడుగు గ్రామాలలో చైన్ స్నాచింగ్లు చేసినట్టు తెలిపారు. ఇట్టి నేరస్తులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మోర్తాడ్ ఎస్సై జి అనిల్ రెడ్డి, పిసి లు సురేష్ నారాయణ, కమ్మర్ పెళ్లి పిసి నవీన్ చంద్రాలను జిల్లా సిపి అభినందించినట్టు తెలిపారు ..ఈ విలేకరుల సమావేశంలో భీమ్గల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love