ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిభిరం: డీఎస్పీ నాగేంద్ర  చారి

నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో  ఉచితంగా నిర్వహిస్తున్న  వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని వేములవాడ డిఎస్పి నాగేంద్ర చారి అన్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  ఆదేశాల మేరకు  జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో  వేములవాడ పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయగా, ఈ శిబిరానికి బుధవారం ముఖ్యఅతిథిగా వేములవాడ డిఎస్పి నాగేంద్ర చారి విచ్చేసి, ప్రారంభించారు.  ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా ఆసక్తి చూపాలని, క్రీడాల ద్వారా మాలిక ఉల్లాసం, శరీరక దృఢత్వం పాటు కలుగుతుంది అన్నారు. ఈ శిబిరంలో కబడ్డీ వాలీబాల్ ఆర్చర్ యోగ క్రికెట్ కరాటే తో పోలీస్ శాఖకు సంబంధించిన శిక్షణ పై, పోలీస్ శాఖల లో అమలు పరుస్తున్న మొదలగు అంశాలపై అవగాహన కల్పిస్తామని అన్నారు. ప్రతిరోజు ఉదయము 6 గంటల నుంచి 8 గంటల వరకు అలాగే సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఉచిత వేసవి క్రీడా శిక్షణ  ప్రభుత్వ జూనియర్ కాలేజీలో  కొనసాగుతాయని సూచించారు. వేములవాడ సబ్ డివిజన్ పరిధిలోని ఆసక్తి కలిగిన సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. డీఎస్పీ వెంట  వేములవాడ టౌన్ సిఐ వీర ప్రసాద్, రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై అంజయ్య, ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్, కరాటే మాస్టర్ అబ్దుల్ మన్నాన్, లోలోపు రాజు, పోలీస్ సిబ్బంది తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love