– ప్రిన్సిపాల్ అల్లు అనిత.
నవతెలంగాణ – అశ్వారావుపేట
విద్యార్ధుల హాజరు శాతం పెంపుదల,వారి ప్రవర్తనలో క్రమశిక్షణ పెంపొందించేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అల్లు అనిత తెలిపారు. బుధవారం నవతెలంగాణ తో ఆమె మాట్లాడారు.ప్రస్తుతం కళాశాలలో రెండు సంవత్సరాలకు కలుపుకుని 210 మంది విద్యార్ధులు నమోదు అయ్యారని,కానీ నేటి హాజరు మాత్రం 71 మాత్రమేనని అన్నారు.ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరని,లిఫ్ట్ చేసిన బధ్యతారాహిత్యంగా సమాధానం చెప్తారని ఆవేదన వ్యక్తం చేసారు. గతంలో హాజరు కు పరీక్షలు కు సంబంధం ఉండేదని,కనీసం 75 శాతం హాజరు ఉంటేనే పరిక్ష లు రాసే విధంగా నిబంధన ఉండేదని నేడు అలాంటి ఏ నిబంధన లేకపోవడంతో నేరుగా పరీక్షల ఫీజు కొట్టే సమయంలో వచ్చి ఫీజు చెల్లించి పరీక్షలు రాయడానికి మాత్రమే హాజరు అవుతున్నారని వారు అన్నారు. ఇందుకోసం విధ్యార్ధులు హాజరు పెంపుతో పాటు క్రమశిక్షణ పెంపొందించేందుకు కార్యాచరణ చేపడుతున్నాం అని అన్నారు. ఏ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎం.పీ.సీ చదివిన విధ్యార్ధులు కు అయినా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రభుత్వం పూర్తి రాయితీ విద్యను అందించే సౌకర్యం తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుంది అని అన్నారు.ఈ సదావకాశాన్ని ప్రతీ విద్యార్ధి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.