వికసిత విద్యకు నిధులు మంజూరు..

– పీఎం శ్రీ పధకానికి ఎం.పీ.పీ.ఎస్ నారం వారి గూడెం ఎంపిక..
– ఈ పాఠశాల అసౌకర్యాలు లేమి పై నా తెలంగాణ అనేక కధనాలు ప్రచురితమైన ఫలితం..
– సాంకేతికతతో కూడిన సమగ్ర విద్యాభివృద్ధి – ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్
నవతెలంగాణ – అశ్వారావుపేట
వచ్చే ఏడాది నుండి పలు పాఠశాలల్లో పీఎం శ్రీ (ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా – ప్రధాన మంత్రి భారతీయ వికసిత విద్యా) పధకం తో జాతీయ నూతన విద్యావిధానం అనుగుణంగా వికసిత విద్య అమలు కానుంది. ఈ పధకంలో భాగంగా దేశంలో వ్యాప్తంగా  14500, రాష్ట్రవ్యాప్తంగా 505,జిల్లా వ్యాప్తంగా 19,నియోజక వర్గంలో మండలానికి ఒకటి చొప్పున 5 పాఠశాలల్లో ఈ విద్యా విధానం అమలుకు నిధులు మంజూరీ అయి ఆయా పాఠశాలల ఖాతాల్లో జమ చేసారు. అశ్వారావుపేట మండలంలోని నారం వారి గూడెం మండల పరిషత్ పాఠశాల ఎంపిక అయింది.గతంలో ఈ పాఠశాలలోని అసౌకర్యాలు,అవసరాలు పై చెట్టుక్రింద చదువులు,కాంట్రాక్టర్ కక్కుర్తి అనే శీర్షికన నవతెలంగాణ పలు కధనాలు ప్రచురితం అయ్యాయి.వీటి ఫలితంగా నాటి కలెక్టర్ అను దీప్,సంయుక్త కలెక్టర్ కే.వెంకటేశ్వర్లు సందర్శించి ఈ పాఠశాల అభివృద్ధికి పూనుకున్నారు.అనంతరం మన ఊరు – మన బడి పధకం లోనూ ఈ పాఠశాలకు నిధులు కేటాయించి ఆధునీకరించారు.అంతే కాకుండా ఈ పాఠశాలను పీఎం శ్రీ పథకానికి ఎంపిక చేయడం ఈ పాఠశాల దశ తిరిగింది. 2023 – 2024 నుండి 26 – 27 వరకు ప్రతీ ఏడు ఉ పాఠశాలకు  రూ.1 లక్షా 25 వేలు పై చిలుకు నిధులు వచ్చే అవకాశం ఉంది. 23 – 24 విద్యాసంవత్సరం కు గానూ వార్షిక గ్రాంట్ రూ.75 వేలు,విద్యార్ధుల ఏకరూప దుస్తులు కుట్టు వ్యయం రూ.14 వేలు,రాణి రుద్రమ ఆత్మరక్షక్ ప్రశిక్షణ్ నిమిత్తం రూ.15 వేలు నిధులు మంజూరు అయ్యాయి.దీంతో ఈ పాఠశాల లో మౌళిక సదుపాయాలు,విద్యార్ధులు సమగ్ర విద్యాభివృద్ధి కి సమృద్ధిగా నిధులు వస్తాయి.
సాంకేతికతతో కూడిన సమగ్ర విద్యాభివృద్ధి కి అవకాశం – ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్
పీఎం శ్రీ నిధులతో పాఠశాలను ఆధునీకరించడం తో పాటు,విద్యార్ధులకు సాంకేతికతతో కూడిన సమగ్ర విద్యాభివృద్ధి సాధ్యం అవుతుందని హర్షం వ్యక్తం.ఈ పాఠశాల పై సామాజిక బాధ్యతతో కూడిన కధనాలు ప్రచురించిన “నవతెలంగాణ” కు అభినందనలు తెలిపారు.
పీఎం శ్రీ అంటే ఏమిటి?
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా,ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారతదేశం అంతటా దాదాపు 14,500 పాఠశాలలను అప్గ్రేడ్ చేయనున్నట్లు ప్రకటించారు. కొత్త కేంద్ర ప్రాయోజిత పథకం, ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం శ్రీ – PM-SHRI).
విద్యా మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ పథకం ప్రస్తుతం ఉన్న 14,500 పాఠశాలలను కవర్ చేస్తుంది.ఇది కొత్త జాతీయ విద్యా విధానం, 2020 యొక్క ముఖ్య లక్షణాలను ప్రతిబింబించేలా తిరిగి అభివృద్ధి చేయబడుతుంది. ఈ పథకాన్ని ప్రారంభించే ప్రణాళికను మొదట రాష్ట్రాల విద్యా మంత్రులతో చర్చించారు.జూన్ లో గుజరాత్లోని గాంధీనగర్లో విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించిన సదస్సులో యుటిలు. రాష్ట్రాలను సంప్రదించిన తర్వాతే చొరవ తీసుకుంటామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అప్పుడు చెప్పారు. నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలు వంటి ఆదర్శ ప్రాయమైన పాఠశాలలు ఉండగా,పీఎం శ్రీ,ఎన్ఈపీ ల్యాబ్లుగా పనిచేస్తుందని ప్రధాన్ తెలిపారు.
ఈ పాఠశాలల తో  విద్యార్థులకు చేకూరే ప్రయోజనం:
ఈ పథకం కింద అభివృద్ధి చెందే సంస్థలు ‘మోడల్ స్కూల్స్’గా మారుతాయని,జాతీయ విద్యా విధానం సారాంశాన్ని సంగ్రహిస్తాయని ప్రధాని మోదీ అన్నారు.జాతీయ విద్యా విధానం గత కొన్ని సంవత్సరాలుగా విద్యా రంగాన్ని మార్చేసింది. పాఠశాలలు ఆధునికమైన. పరివర్తనాత్మకమైన మరియు సంపూర్ణమైన విద్యను బోధించే విధానాన్ని అవలంబిస్తామని ఆయన అన్నారు. పాఠశాలలు ఆవిష్కరణ-ఆధారిత, అభ్యాస – కేంద్రీకృత బోధనా పద్ధతికి ప్రాధాన్యత ఇస్తాయి. స్మార్ట్ క్లాస్లూమ్లు, క్రీడలు, అత్యాధునిక సాంకేతికతపై కూడా దృష్టి సారిస్తారు. పాఠశాలలు బ్యాచ్లు, లైబ్రరీలు మరియు ఆర్ట్ూమ్లతో అప్గ్రేడ్ చేయబడతాయి. పాఠ్యాంశాల్లో భాగంగా నీటి సంరక్షణ, వ్యర్ధాల పునర్వినియోగం, ఇంధన-సమర్ధవంతమైన మౌలిక సదుపాయాలు మరియు సేంద్రీయ జీవనశైలిని ఏకీకృతం చేయడంతో వాటిని గ్రీన్ స్కూల్లుగా అభివృద్ధి చేస్తారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ముందుగా మాట్లాడుతూ,ఈ పథకం విద్యార్ధులను భవిష్యత్తు కోసం సిద్ధం చేయడానికి పూర్తిగా సన్నద్ధ మవుతుందని మరియు ఈ అత్యాధునిక పాఠశాలలు జాతీయ విద్యావిధానం  2020 యొక్క ప్రయోగశాలగా ఉంటాయని చెప్పారు. నేర్చుకునే వాతావరణం మరింత ఆనందంగా ఉంటుంది. అదే సమయంలో విద్యా ఫలితాలను మెరుగుపరుస్తుంది. ఎన్ఈపీ యొక్క దార్శనికత ప్రకారం,ఈ పథకం పిల్లల విభిన్న నేపథ్యం, బహుభాషా అవసరాలు మరియు విభిన్న విద్యా సామర్థ్యాలను చూసుకునే సమానమైన, కలుపుకొని మరియు సంతోషకరమైన పాఠశాల వాతావరణంలో ఉన్నత నాణ్యత గల విద్యను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. విద్యార్థులు వారి అభ్యాస ప్రక్రియలో భాగస్వాములు అయ్యేలా చూడటం కూడా దీని లక్ష్యం.
కేంద్ర ప్రాయోజిత పథకం అంటే ఏమిటి?
పీఎం శ్రీ పథకం కేంద్ర ప్రభుత్వంచే స్పాన్సర్ చేయబడినందున, అమలు ఖర్చులో 60 శాతం కేంద్రం భరిస్తుంది, మిగిలిన 40 శాతం రాష్ట్రం లేదా యూటీ భరిస్తుంది. అయితే, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ మరియు కాశ్మీర్ మరియు ఈశాన్య వంటి కొన్ని రాష్ట్రాలలో, కేంద్ర ప్రభుత్వ సహకారం 90 శాతానికి చేరుకుంటుంది.
Spread the love