వచ్చే బడ్జెట్లో ఐసిడిఎస్ కు నిధులు కేటాయించాలి

నవతెలంగాణ – మోర్తాడ్
వచ్చే కేంద్ర బడ్జెట్లో ఐసిడిఎస్ ప్రాజెక్టుకు నిధులు కేటాయింపు తో పాటు అదనపు నిధులు పెంచాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడి యూనియన్ నాయకులు మండల తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు దేవగంగు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అదనపు నిధులతో పాటు అంగన్వాడీల అభివృద్ధికి నిధులు కేటాయించాలని అన్నారు. దేశవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ వెల్ఫేర్ గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం జాతీయ అవమానంగా భావిస్తున్నామని గత 48 సంవత్సరాల నుండి 26 లక్షల మంది అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కార్మికులుగా పనిచేస్తున్నారని వీరికి గుర్తింపు లేకపోవడంతో ప్రభుత్వ స్కీమ్స్ కోల్పోతున్నామని అన్నారు. 2022లో భారత సర్వోన్నత న్యాయస్థానం అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ గ్యాం డ్యూటీ కి అర్హులని తీర్పించిన అప్పటి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తమకు అన్యాయం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం తమకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అంగన్వాడీ టీచర్స్ ని మూడో తరగతి హెల్పర్స్ నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలని కనీస వేతనం నెలకు 26 వేల రూపాయలు తో పాటు నెలకు పదివేల రూపాయల ఈ పింఛన్ మంజూర ఎలా సవరణలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love