గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి

Funds should be released to Gram Panchayatsనవతెలంగాణ- రాయపోల్ 

గ్రామపంచాయతీలలో నిధులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కనీస సౌకర్యాలు కూడా గ్రామ ప్రజలకు కల్పించాలేని పరిస్థితిలో పంచాయతీ కార్యదర్శులు ఉన్నారని పంచాయతీ కార్యదర్శుల యూనియన్ మండల అధ్యక్షులు శివకుమార్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎనిమిది నెలల నుంచి గ్రామాలలో పరిపాలన పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు నిర్వహించడం జరుగుతుందని సర్పంచుల పదవీకాలం పూర్తి కావడంతో ప్రత్యేక అధికారులతో పరిపాలన కొనసాగించడం జరుగుతుందన్నారు. కానీ గ్రామ పంచాయతీలలో నిధులు లేక సమస్యలు పేరుకుపోతున్నాయని పంచాయతీ కార్యదర్శులు సొంత నిధులు కేటాయించి గ్రామాలలో పనులు చేయిస్తున్నారు. వేతనం గ్రామ పనులకు కేటాయించడం వలన కుటుంబ పోషణకు డబ్బులు లేక ఆర్థికంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలు త్వరలో రాబోతున్నాయని గ్రామాలలో ఆ పండుగలకి ఏర్పాట్లు చేయాలంటే గ్రామపంచాయతీలో నిధులు లేవు. కాబట్టి పంచాయతీ కార్యదర్శులకే పెనుబారమవుతుందన్నారు. కొన్ని గ్రామాలలో కార్మికులకు వేతనాలు చెల్లించాలని పరిస్థితిలో ఉన్నాయన్నారు. పారిశుద్ధ్య పనులు కొనసాగించలేని స్థితిలో గ్రామపంచాయతీలు ఉన్నాయని నిత్యం చెత్త సేకరణ చేయడానికి ట్రాక్టర్ డీజిల్ కి కూడా నిధులు లేక ఇబ్బందులు అవుతున్నాయన్నారు. ఇలాంటి సమస్యలతో పంచాయతీ కార్యదర్శులు సతమతమవుతున్నారని వెంటనే జిల్లా అధికారులకు ప్రభుత్వ దృష్టికి మా సమస్యలను పరిష్కరించాలని గ్రామపంచాయతీలకు నిధులు మంజూరు చేయాలని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీఓ శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు పరమేష్, విజయ్ కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Spread the love