– నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగాల గురించి రగిలిపోతున్నారు
– మునుగోడు నియోజకవర్గం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇంచార్జి జి.రవీందర్
నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
రానున్న పార్లమెంటు ఎన్నికలలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ ను భారీ మేజారీటి తో గెలిపించాలని మునుగోడు నియోజకవర్గం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇంచార్జ్ జి.రవీందర్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం పత్రిక సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ గత అనుభవాలను నెమరు వేసుకుంటూ,బి ఆర్ ఎస్ పార్టీ గతంలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటూ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పి అందని ద్రాక్షాను ప్రజలకు చూపిస్తూ కాలం వెల్లబోసు కుంటున్నారని తెలిపారు.యావత్తు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ విధివిధానాలపై బగ్గుమంటున్నారని తెలిపారు. ప్రతి ఇంటిలోని మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఇస్తానన్న రూ.2500/- రూపాయలు డిసెంబర్ 9 నుండి అమలు చేయాలని, అలాగే స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధులకు నాలుగు వేల రూపాయల పించన్ పెన్షన్ ను ఏరియర్స్ తో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని యువతి యువకులకు 100 రోజులలో నెరవేర్చాల్సిన ఉద్యోగ నోటిఫికేషన్ ల హామీ ప్రకటన విషయం గురించి నిరాశతో నిరుద్యోగులు రగిలిపోతున్నారన్నారు. సభ వేదికల సాక్షిగా విలువైన బాండ్ పేపర్ల రూపంలో 100 రోజులలో అమలు చేస్తానన్న గ్యారంటీలను అమలు చేయక పోవటమే కాకుండా పూటకో మాట చెబుతూ రోజుకొక నేతలతో ఏవేవో ప్రకటనలు చేస్తూ మాయ మాటలు చెబుతూ అందని ద్రాక్షానను చూపిస్తూ కాలం వెళ్లదీస్తున్న ఈ ప్రభుత్వంకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పాలన్నారు. ప్రస్తుత పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి చురకలు అంటించడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని, అని అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చేసినటువంటి అభివృద్ధి పనులను,రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కూడాప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం పార్లమెంట్ ఎలక్షన్లలో బి.ఆర్.ఎస్.పార్టీకి మద్దతు తెలుపడానికి తెలంగాణ ప్రజలంతా నిర్ణయించుకుంన్నారని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి ప్రజలంతా ఏకమై తమ వంతు బాధ్యతగా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థులకు ఓటు వేయాలని,భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేష్ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.