Thursday, September 17, 2026
E-PAPER
Homeఆదిలాబాద్గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించుకోవాలి

గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్‌
గ్రామాల్లో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ముధోల్‌ ఎస్సై బిట్ల పెర్సిస్ తెలిపారు. మండలంలోని తరోడ, చించాల, వెంకటాపూర్ ,ఎడ్ బిడ్, గ్రామాల్లో గల వినాయక మండపాలను ఎస్సై గురువారం రాత్రి సందర్శించారు. గణేష్ మండపంలో  పూజా కార్యక్రమంలో ఎస్సై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సై మాట్లాడారు. గణేష్ నిమజ్జనం అందరు కలిసిమెలిసి నిర్వహించుకోవాలన్నారు. గణేష్ నిమజ్జనం రోజు చెరువుల వద్ద చిన్న పిల్లలు చెరువుల వద్దకు వెళ్లకుండా, తల్లిదండ్రులు గణేష్ మండలి నిర్వాహకులు చూసుకోవాలని సూచించారు. నిమజ్జన శోభాయాత్రలో కరెంట్ సరఫరా లో గణేష్ మండలి నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిమజ్జనాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని అన్నారు. నిరంతరం పోలీసుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సర్వేష్, శ్రావణి గంగ శేఖర్, మాజీ సర్పంచ్ ఉమా సత్యనారాయణ, యువజన సంఘాల సభ్యులు, గణేష్ మండల నిర్వాహకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -