జార్జి రెడ్డి 53వ వర్ధంతి సభల పోస్టర్ల ఆవిష్కరణ

నవతెలంగాణ- ఆర్మూర్
పి.డి.ఎస్.యూ విద్యార్థి సంఘం వ్యవస్థాపకుడు కామ్రేడ్ జార్జ్ రెడ్డి 53వ వర్ధంతి సభలను ఈనెల 10 నుంచి 14 వరకు జరపాలనీ పి.డి.ఎస్.యూ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ జార్జ్ రెడ్డి 53 వర్ధంతి పోస్టర్స్ ఆవిష్కరణ గురువారం పట్టణంలో నిర్వహించినారు.ఈ సందర్బంగా డివిజన్ అధ్యక్షులు ప్రిన్స్ మాట్లాడుతు ఉస్మానియా ధ్రువతార, హైదరాబాద్ చేగువేరా కామ్రేడ్ జార్జి రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఒకవైపు ర్యాగింగ్ పేరుతో గ్రామీణ పేద విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్లను విద్యకు దూరం చేస్తున్న పరిస్థితుల్లో వారికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. మరోవైపు మతోన్మాదానికి వ్యతిరేకంగా, మహిళలపై జరిగే లైంగిక దాడులకు వ్యతిరేకంగా బిగి పిడికిలి బిగించి పోరాడిన విప్లవ, విద్యార్థి నాయకులు కామ్రేడ్ జార్జి రెడ్డి అని అన్నారు. క్యాంపస్ లో జరుగుతున్న అన్యాయాలను, లంపెన్ గుండాల దాడులను ఎదిరించి విద్యార్థులకు అండగా నిలబడ్డారని అన్నారు. సమసమాజ స్థాపన లక్ష్యంగా ఉద్యమిస్తున్న జార్జి రెడ్డి ఎదుగుదలని జీర్ణించుకోలేని మతోన్మాద గుండాలు జార్జి రెడ్డి ని హత్య చేశారన్నారు. ఆయన ఆశయాల సాధనకై విద్యార్థులు పోరాడాలని, అయన 53వ అమరత్వాన్ని స్మరించుకుంటూ ఈ నెల ఏప్రిల్ 10 నుండి 14 తేది వరకు వర్ధంతి సభలను ఘనంగా జయప్రదం చేయాలని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధక్షులు హుస్సేన్, నాయకులు రాహుల్, సాయి, పవన్, రహమాన్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు..

Spread the love