
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 55 సుఖ వ్యాధుల పరీక్ష కేంద్రాలలో [ఎస్టిడి క్లినిక్] 2023- 24 వార్షిక సంవత్సరానికి , ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నిజామాబాద్ లో ఉన్న సుఖ వ్యాధుల పరీక్షా కేంద్రం (ఎస్.టి.డి క్లినిక్) మొదటి స్థానంలో ఉన్నందున టిఎస్ఎసిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హైమావతి ఐఏఎస్ చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డు ప్రశంసా పత్రం ను జిజిహెచ్ ఎస్టిడి కౌన్సిలర్ కే.వరలక్ష్మి అందుకోవడం జరిగింది. అందుకుగాను డాక్టర్ ప్రతిమ రాజ్ సూపరింటెండెంట్ చర్మవ్యాధుల విభాగానికి చెందిన వైద్యులను కౌన్సిలర్ వరలక్ష్మిని అభినందించడం జరిగింది.