ప్రజలకు అందుబాటులో గీతాంజలి కిడ్నీ కేర్

నవతెలంగాణ – రాయపర్తి
సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకే గీతాంజలి కిడ్నీ కేర్,రీసెర్చ్ సెంటరును ఏర్పాటు చేసినట్లు డాక్టర్లు గీతాంజలి, నరేష్ తెలిపారు. ఆదివారం మండలకేంద్రంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానికులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్లు గీతాంజలి, నరేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సకల్పముతో జిల్లా కేంద్రంలో కిడ్నీ కేర్ రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. జిల్లా కేంద్రానికి రాలేని ప్రజల కోసం గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరింత వైద్యం సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ శిబిరంలో డాక్టర్లు సముద్రాల నరేష్, చంద్రశేఖర్,అభినవ్ రామ్, గౌతమ్ పుప్పాల, వంశీ, సామర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love