గొర్రెల పంపిణీలో అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలి: జీఎంపీస్

నవతెలంగాణ – ఐనవోలు
బీఆర్ఎస్ ప్రభుత్వంలో గొర్రెల పంపిణీలో జరిగిన వందల కోట్ల అవినీతినీ పై స్థాయి నుండి కింది స్థాయి వరకు సమగ్ర విచారణ చేపట్టాలని గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం డిమాండ్ చేస్తుంది. గొల్ల కురుమలు డిడిలు కట్టలేని పరిస్థితిలో ఉన్నవారి పేరు తో మరో కొంతమంది కట్టేటట్లు ప్రోత్సహించిన అవినీతికి పాల్పడిన డాక్టర్లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. మండల ప్రధాన కార్యదర్శి నల్లబెట్ట చిన్న రాజు ప్రకటన విడుదల చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2017 జూన్ 20న ప్రారంభించించింది. రాష్ట్రంలో 7,31,368 మంది గొల్లకురుమలను లబ్దిదారులుగా ఎంపికచేసి ఇప్పటి వరకు ఆరు వేల కోట్లు ఖర్చు చేసి 4లక్షల మందికి గొర్రెలను పంపిణీ చేశారు. పంచిన గొర్రెల్లో నిబంధనలకు విరుద్ధంగా ముసలి గొర్రెలు, పొట్టేలు. పంపిణీ చేయలేదు. చిన్న పిల్లలు, నాసిరకం గొర్రెలు గొల్లకురుమలకు కట్టబెట్టి ఆర్థికంగా నష్టపరిచారు. వేలకోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగపర్చారు. ఇంకా 3,31,368 మందికి ఇవ్వాల్సి ఉంది. పథకం ప్రారంభించిన ఆరు నెలల నుండే అవినీతి అక్రమాలు జరిగాయి. మొదటి విడుతలో ఈ పథకం గొల్లకురుమలకంటే ఎక్కువగా కొంతమంది పశువుల డాక్టర్లకే ఎక్కువ లాభం చేసింది.
రెండో విడుతలో మధ్య దళారీలకు ఉపయోగపడుతుంది. తమ సంఘం ఆధ్వర్యంలో అక్రమాలపై ఆధారాలతోసహా ఆనాటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పశుసంవర్ధక శాఖ రాష్ట్ర అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుత కాంగ్రేస్ ప్రభుత్వం అవినీతిపై విచారణ చేపట్టడం స్వాగతిస్తున్నాము. పథకం ప్రారంభం నుండి ఇప్పటి వరకు జరిగిన మొత్తం పంపీణీపై క్షేత్రస్థాయి వరకు సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ అవినీతిలో భాగస్వాములైన అధికారులను, దళారీలను, రాజకీయ నాయకులు వారు ఎంతటి వారైనా ఉపేక్షించకూడదు. ప్రస్తుత ఎసిబి విచారణను రాజకీయ అవసరాల కోసం దారి మళ్లించొద్దని కోరుతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా రూ.80 వేలు. హనుమకొండ జిల్లాలో1079.మంది గొర్రెల కోసం ఒక్కొక్కరు రూ.43,750/-ల చొప్పున డి.డి.లు తీసి రెండేండ్లుగా వేచి చూస్తున్నారు. కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి రాకముందు 90 రోజుల్లో రెండో విడుత గొర్రెల పంపిణీ పూర్తి చేస్తామని తమ మేనిఫెస్టోలో పొందు పరిచారు. కాని ప్రస్తుతం ఆ డి.డి.లు వాపస్ తీసుకొమ్మని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. గొర్ల పంపిణీలో జరిగిన అవినీతి పేరుతో ప్రభుత్వం ఈ పథకాన్ని ఆపడం సరైనది కాదని. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్ధానాన్ని విస్మరించాలని చూస్తుండటం సరైంది కాదు. అవినీతి లేకుండా నగదు బదిలీ చేయాలని గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం మొదటినుండి సూచిస్తుంది. గతంకంటే ఉత్తమంగా అమలు చేసి చూపించాలి కానీ మోసం చేయాలని చూస్తే గొల్లకురుమల నుండి వ్యతిరేకత తప్పదు అని హనుమకొండ కమిటీ మెంబర్  లింగయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Spread the love