బంగారం ప్రియులకు గుడ్ న్యూస్..

నవతెలంగాణ – హైదరాబాద్: బంగారం ధరలు.. భారీగా తగ్గాయి.  బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 72, 540 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 66, 490 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 93, 400 గా నమోదు అయింది.

Spread the love