భారీగా తగ్గిన బంగారం ధరలు

నవతెలంగాణ -హైదరాబాద్ : అక్షయ తృతీయ ఎఫెక్ట్..బంగారం ధరలు.. భారీగా తగ్గాయి. నిన్న తగ్గిన బంగారం ధరలు…ఇవాళ కూడా కాస్త తగ్గాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 72, 150 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 66, 140 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 85, 300 గా నమోదు అయింది.

Spread the love