Monday, July 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనిరుద్యోగులకు గుడ్‌‌న్యూస్‌

నిరుద్యోగులకు గుడ్‌‌న్యూస్‌

- Advertisement -


తెలంగాణలో 7437 పోలీస్‌ ‌పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌
త్వరలో నియామక నోటిఫికేషన్‌


‌నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పోలీసు శాఖతో పాటు ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్) విభాగాల్లో మొత్తం 7,437 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో ఒక్క పోలీసు శాఖలోనే 5 వేల పోస్టులు ఉండటం విశేషం. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి నేపథ్యంలో తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌‌పీఆర్‌‌బీ) త్వరలో నియామక నోటిఫికేషన్ విడుదల చేయనుంది. స్థానిక కేడర్ వారీ పోస్టుల పంపిణీ, రోస్టర్ పాయింట్లు, విద్యార్హతలు తదితర వివరాలు అందిన వెంటనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు బోర్డు వెల్లడించింది. పోలీసు శాఖలో 148 సివిల్ ఎస్‌ఐలు, 29 రిజర్వ్ ఎస్‌ఐలు, 23 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు, 4,800 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే ఫైర్ శాఖలో 790, జైళ్ల శాఖలో 223, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 1,424 పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు. అన్ని పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారానే భర్తీ చేయనున్నారు.

శాఖల వారిగా పోస్టులు
పోలీసు శాఖ : 5,000
ఫైర్ శాఖ : 790
జైళ్ల శాఖ : 223
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌‌పీఎఫ్‌) : 1,424
మొత్తం పోస్టులు : 7,437
నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అనంతరం ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), తుది రాత పరీక్ష తదితర దశల్లో ఎంపిక ప్రక్రియ కొనసాగనుంది. పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, పరీక్షల సిలబస్, పరీక్షల షెడ్యూల్‌ను అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడించనున్నారు. గత నియామకాలతో పోలిస్తే ఈసారి పోలీసు శాఖతో పాటు ఫైర్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో కూడా ఒకేసారి భారీ స్థాయిలో నియామకాలు చేపట్టనున్న నేపథ్యంలో లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఉద్యోగార్థులు ఇప్పటి నుంచే రాత పరీక్షతో పాటు శారీరక దారుఢ్య పరీక్షలకు సిద్ధమైతే ప్రయోజనం ఉంటుందని సూచిస్తున్నారు.

పోలీసు శాఖలో పోస్టులు
ఎస్‌ఐ (సివిల్) – 148
రిజర్వ్ ఎస్‌ఐ (ఏఆర్) – 14
రిజర్వ్ ఎస్‌ఐ (టీజీఎస్పీ) – 12
రిజర్వ్ ఎస్‌ఐ (సార్‌సీపీఎల్) – 3
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ – 23
కానిస్టేబుల్ (సివిల్) – 3,697
కానిస్టేబుల్ (ఏఆర్) – 1,052
కానిస్టేబుల్ (సార్‌సీపీఎల్) – 24
డ్రైవర్ కానిస్టేబుల్ – 20
మెకానిక్ కానిస్టేబుల్ – 7

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -