
ఇటీవల కాలంలో మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఈసం గోపయ్య బాధిత కుటుంబానికి గుండాల పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్సై ఎల్.రవీందర్, కిన్నెర రాజశేఖర్ 40 కేజీల బియ్యం, రూ.3 వేలు ఆర్థిక సాయం బుధవారం అందజేశారు. గుండాల జీపీ పారిశుద్ధ్య కార్మికుడు గోపయ్య రోడ్డు ప్రమాదానికి గురై, చికిత్స పొందుతూ గత నెల 20వ తేదీన ఖమ్మంలో చనిపోయిన విషయం విదితమే. మృతుడి కుటుంబాన్ని ఆదుకొని విధి నిర్వహణతో పాటు సాంఘీక కార్యక్రమాల్లోనూ మేము సైతమని గుండాల పోలీసులు చాటిచెప్పారు. గోపయ్య కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయానికి ప్రతిగా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉప సర్పంచ్ మానాల ఉపేందర్, ఆజాద్, నిట్ట అనీల్, తదితరులు పాల్గొన్నారు.