జిల్లా ఉత్తమ వ్యవసాయ  అధికారిగా గోపాల్ నాయక్

–  ప్రశంస పత్రాన్ని అందజేసిన కలెక్టర్ శశాంక.

నవతెలంగాణ –  కొత్తూరు

జిల్లా ఉత్తమ వ్యవసాయ అధికారిగా గోపాల్ నాయక్ ఎంపికయ్యారు. కొత్తూరు మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న గోపాల్ నాయక్ రైతులతో కలిసి మండలంలో వ్యవసాయ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరిగిన వేడుకల్లో కలెక్టర్ శశాంక చేతుల మీదుగా ఆయన ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు జిల్లా, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి గీత తదితరులు ఉన్నారు.

Spread the love