కార్మికుల కోసం గోపన్న చేసిన పోరాటం గొప్పది..

నవతెలంగాణ – మునుగోడు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో  జరిగిన అనేక కార్మిక సమ్మె పోరాటాలలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు తిరందాస్ గోపి ముఖ్యమైన పాత్ర నిర్వహించిన గొప్ప కార్మిక నాయకుడు తిరందాసు గోపి అని సీఐటీయూ మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు కొనియాడారు. బుధవారం మండల కేంద్రంలోని కార్మిక భవనంలో గోపి 7 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు . ఈ సందర్భంగా ముత్యాలు మాట్లాడుతూ.  కార్మిక చట్టాలను సాధారణ కార్మికులకు వివరించి కార్మిక వర్గాన్ని చైతన్యం చేయడంలో తిరందాస్ గోపి  చురుకుగా వ్యవహరించారని అన్నారు. ఆయన లేని లోటు ఉమ్మడి నల్గొండ జిల్లా కార్మికోద్యమానికి తీరనిలోటని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మాజీ మండల కార్యదర్శి యాస రాణి శ్రీను , సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు వేముల లింగస్వామి , ఎర్ర అరుణ , నీల అండాలు, నూకల పెద్దమ్మ , వేముల విజయ్ ,వంపు యాదయ్య, నీరుడు రాజ్యలక్ష్మి , కొక కమలమ్మ , చెడుబుద్ధి యాదమ్మ , పందుల పావని , పద్మ, బొజ్జ సుజాత, పోలే అండాలు , ఆకారం లలిత , పందుల సత్తమ్మ తదితరులు ఉన్నారు.
Spread the love