
– ఖరీఫ్ ధాన్యం కు అందించాల్సిన బోనస్ను నేటికీ రైతు ఖాతాలలో జమ కాలేదు..
– కొనుగోలు కేంద్రాలలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం..
– రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం..
నవతెలంగాణ – మునుగోడు: ప్రభుత్వం కొన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు ప్రకటనల కోసం మాత్రమే కేంద్రాలను ప్రారంభించారని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం ఆరోపణ చేశారు . గురువారం మండల కేంద్రంలోని చౌటుప్ప రోడ్లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతు సంఘం ఆధ్వర్యంలో పరిశీలించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోన సంచులు లేకుండానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతో ధాన్యం విక్రయించుకునేందుకు వచ్చిన రైతులు గోనె బస్తాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ధాన్యం ను అమ్ముకునేందుకు వచ్చిన రైతులకు నష్టం కలిగే విధంగా తేమ, తాలు పేరుతో మోసం చేయకుండా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని సూచించారు. సన్న రకం, దొడ్డు రకం దాన్యముకు ప్రభుత్వం ప్రకటించిన 500 బోనసును అందించాలని కోరారు. వేసవికాలంలను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాల వద్ద నీడ, త్రాగునీరు తో పాటు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఖరీఫ్ ధాన్యం కు అందించాల్సిన బోనస్ను నేటికీ రైతు ఖాతాలలో జమ చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. రైతులను ఇబ్బందులకు గురి చేసే విధంగా కేంద్రాలలో నిర్వాహకులు చేసినట్లయితే రైతులతోనే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు సాగర్ల మల్లేష్, మండల కార్యదర్శి వేముల లింగస్వామి, ఉడుత లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.