ప్రభుత్వం సిద్దం చేసినా సంసిద్ధం కాని సిబ్బంది..

– శుభ్రత లేని పాఠశాల ప్రాంగణాలు..

– కొనసాగుతున్న మరమ్మత్తులు..
నవతెలంగాణ – అశ్వారావుపేట 
ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట పేరుతో ప్రభుత్వం ఈ 6 నుండి 12 వరకు కార్యాచరణతో సిద్దం చేసినా క్షేత్రస్థాయిలో ఉపాద్యాయులు సంసిద్ధంగా లేరనేది పాఠశాలలు పునః ప్రారంభం రోజు పాఠశాలలను తనిఖీ చేసిన ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. అమ్మ ఆదర్శ పాఠశాలలు లోనూ,మన ఊరి మన బడి పాఠశాల లోనూ నేటికి పనులు సాగుతూనే ఉన్నాయి. దీంతో విద్యార్ధులుకూర్చోవడానికి, ఉపాద్యాయులు పాఠాలు బోధించడానికి అసౌకర్యం నెలకొంది.పునఃప్రారంభం నాటికే మరమ్మత్తులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అల, జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వరా చారి లు చెప్పినప్పటికీ పాఠశాల కమిటీల కు అర్ధం అయినట్లు లేదు.కొన్ని పాఠశాలలో శుభ్రం చేసే వారు లేక పాఠశాల ప్రాంగణం దుమ్ము కొట్టుకుని ఉన్నాయి. అశ్వారావుపేట కాంప్లెక్స్ పరిధిలోని పలు పాఠశాలలను నవతెలంగాణ బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా పేట మాలపల్లి మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు సెలవు పెట్టారని అన్నారు‌.మరో ఉపాధ్యాయుడు భోజనానికి వెళ్ళారు.ఆశ్రమ గిరిజన బాలికల పాఠశాల హెచ్ ఎం విద్యార్ధులు పుస్తకాలు తేవడానికి వెళ్ళారు అన్నారు. ముస్లిం మైనార్టీ పాఠశాల ప్రిన్సిపాల్ శాఖాపరంగా మీటింగ్ కు వెళ్ళారు అని తెలిపారు.
పునః ప్రారంభం రోజు ఉపాద్యాయులకు సెలవు పెట్టే అవకాశమే లేదు.మొదటి రోజు ఎవరూ ఎటూ వెళ్ళకుండా పాఠశాలలోనే ఉండాలి. కానీ ఎవరికి వారు యమునా తీరే అన్నచందంగా ప్రభుత్వ ఉపాద్యాయుల పరిస్థితి ఉంది.
Spread the love