
నవతెలంగాణ – ధర్మారం
తెలంగాణ సాధన కోసం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి తెలంగాణ ఉద్యమకారులందరికీ గుర్తింపు కార్డులు ప్రభుత్వం ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు చింతల తిరుపతి ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి కమిటీ ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్లలో 10% వాటా ఉద్యమకారులకు, ఉద్యమకళాకారులకు ఇవ్వాలని కోరారు. ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో ఉద్యమకారులు ఫోరం ప్రధానకార్యదర్శి హన్మాన్ సింగ్, ఉద్యమకారులు పాకాల రాజయ్య, మూల మల్లేశం, పాక వెంకటేశం, సొల్లు ఓదెలు, దేవి వీరేశం, పుట్ట శ్రీనివాస్, చొప్పదండి సతీష్ తదితరులు పాల్గొన్నారు.