మీనయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి 

Government should support Minaiah's familyనవతెలంగాణ – బెజ్జంకి
అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన మండల పరిధిలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామానికి చెందిన టేకు మీనయ్య కుటుంబాన్ని ఆర్థిక చేయూతనందించి ప్రభుత్వం అదూకోవాలని ఆదివాసి దళిత కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కురుసెంగ వేణు డిమాండ్ చేశారు.గురువారం మృతుని కుటుంబ సభ్యులను వేణు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.కుటుంబం పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం ఎక్స్ గ్రేసియా అందించాలని వేణు విజ్ఞప్తి చేశారు.స్థానికులు హజరయ్యారు.
Spread the love