లంబాడీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

నవతెలంగాణ – బొమ్మలరామారం

లంబాడీల అరుదైన సంస్కృతిని కాపాడుకోవడం మన అందరి భాద్యత, వారి సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. బొమ్మలరామారం మండలంలో చీకటిమామిడి గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. లంబాడాల సాంస్కృతి ఉట్టిపడేలా నృత్యాలు, డప్పు చప్పుళ్లతో స్వాగతం పలికారు.  అనంతరం తిరుమలనాథ స్వామి ఆలయ ఆవరణంలో గురువారం జరిగిన సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని.. సెలవు ప్రకటించాలని బంజారా సోదరులు అడగగానే కార్యక్రమాన్ని ఇవ్వాల అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు.లంబాడా ఉద్యోగ సోదరులకు ప్రత్యేక సెలవు దినంగా ప్రకటించామని గుర్తు చేసారు.హిందువులంతా కాపాడిన గొప్ప చరిత్ర సేవాలాల్ ఉందని, వారు చూపిన బాటలో యువత నడవాలని హిందూ ధర్మాన్ని కాపాడాలని అన్నారు. రానున్న రోజుల్లో సేవాలాల్ మందిరం నిర్వహిస్తామని పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్,ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి,సింగిల్ విండో చైర్మన్ బాల్ నర్సయ్య,ఎంపీటీసీ శ్రీహరి నాయక్,మాజీ సింగిల్ విండో చైర్మన్ మధుసూదన్ రెడ్డి, ఎస్టీసెల్ అధ్యక్షులు రాజు నాయక్,మహిళా అధ్యక్షురాలు సునీత నాయక్, నందరాజ్ గౌడ్, శ్రీరాముల నాయక్,రాజన్ నాయక్, పచ్య నాయక్,శ్రీను,ధీరావత్ రాజేష్ నాయక్, తదితర నాయకులు పాల్గొన్నారు.
Spread the love