కేటీఆర్ అహంకార మాటలు మానుకోవాలి: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

KTR should refrain from arrogant words: Govt. Whip Beerla Ilaiah– బీఆర్ఎస్ నాయకులు గవర్నర్ ను కలవడానికి సిగ్గుండాలి
నవతెలంగాణ – యాదగిరి గుట్ట
రాజ్ భవన్ ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి ఆర్ చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లుప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. శనివారం ఆయన మీడియా తో మాట్లడుతూ బీఆర్ఎస్ నాయకులు గవర్నర్ ను కలవడానికి సిగ్గుండాలన్నారు. అసలు గవర్నర్ వ్యవస్థ పై బీఆర్ఎస్ నాయకులకు నమ్మకం ఉందా..అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ ను అనేక విధాలుగా కేసీఆర్ అవమానించారని మండిపడ్డారు.రాజ్ భవన్ గేటు కూడా దాటకుండా గవర్నర్ ను అనేకసార్లు అగౌరవ పర్చారని.అలాంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు రాజ్యాంగాన్ని రక్షించాలని గవర్నర్ ఆశ్రయించడం సిగ్గు చేటన్నారు.తెలంగాణలో రాజ్యాంగంపై దాడి జరుగుతుందని బీఆర్ఎస్ నేతలంటున్నారని.తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేసింది మీరు కాదా.ప్రశ్నించారు.రాజ్యాంగానికి మాత్రం విలువ ఇవ్వకుండా నియంతృత్వ పాలన చేసింది కల్వకుంట్ల కుటుంబం అన్నారు. రాజ్యాంగాన్ని ఖననం చేసింది కల్వకుంట్ల కుటుంబం కాదా అని మండిపడ్డారు.ఫిరాయింపులకు పాల్పడుతున్నారని రాజ్ భవన్ ముందు కేటీఆర్ గొంతు చించుకుంటున్నారని, పదేళ్ల పాటు ఆయన గొంతు ఎందుకు మూగబోయిందన్నారు. తెలంగాణలో ప్రతిపక్షాలే లేకుండా కేసీఆర్ చేయడానికి ప్రయత్నించినప్పుడు కేటీఆర్ మౌనవ్రతం పాటించారా అని దుయ్య బట్టారు.
ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను మంత్రులు అదే రాజ్ భవన్ లో ప్రమాణం చేయించినప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాలేదా అన్నారు.ప్రొటోకాల్ గురించి కేటీఆర్ తెగ గింజుకుంటున్నాడని మీరు అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ విషయంలో కూడా ప్రొటోకాల్ పాటించలేదన్నారు.అధికార మదంతో ఆ నాడు విర్రవీగి ఈ నాడు రాజ్ భవన్ గేట్ ముందు హాహాకారాలు చేస్తున్నారని.ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలను కనీసం సెక్రటేరియట్ లోకి కూడా అనుమతివ్వకుండా అడ్డుకున్న చరిత్ర మీదన్నారు. హైదరాబాద్ లో భయానక వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టించిందని కేటీఆర్ అంటున్నారని.అధికారం పోగానే హైదరాబాద్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి కేటీఆర్ కుట్ర లు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది. నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవని.నిరుద్యోగుల డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. పదేళ్లలో నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను రోడ్ల మీదకు తీసుకువచ్చింది మీరు కాదా…? అని ప్రశ్నించారు.రైతులకు బేడీలు వేసిన చరిత్ర మీ కేసీఆర్ ది. అన్నారు. రుణమాఫీతో రైతులంతా సంతోషంగా ఉంటే కల్వకుంట్ల మాత్రం కడుపులో కుట్రలతో రగిలిపోతుందన్నారు. గవర్నర్ దగ్గరకు పోయినా రాష్ట్రపతి దగ్గరికి పోయినా బీఆర్ఎస్ నాయకుల తప్పుడు ప్రచారానికి స్పందన ఉండదన్నారు.తెలంగాణ ఇమేజ్ ను దెబ్బతీయడానికి కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న కుట్రలు ఫలించవన్నారు. ఈ సమావేశం లో డిసిసి అద్యక్షుడు అండెం సంజివరెడ్డి నాయకులు మదుసుదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love