ఎల్ఓసీ మంజూరు చేపించిన ప్రభుత్వ విప్ 

నవతెలంగాణ – వీర్నపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల   గ్రామానికి చెందిన టి ప్రవీణ్ అనారోగ్య సమస్యల వలన అత్యవసర చికిత్స అవసరం ఉన్నదని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్  తెలియజేయగానే తక్షణమే స్పందించి నిమ్స్ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందితో చర్చలు జరిపి ప్రత్యేకమైన చికిత్స అందించవలసిందిగా ఆదేశించారు. ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయంగా వెంటనే వైద్య ఖర్చులకు రూ.60,000/- రూపాయలు మంజూరు చేయించారు.అత్యవసర ఆరోగ్య చికిత్స నిమిత్తం ఎల్ఓసి మంజూరు చేయించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Spread the love