కాంగ్రెస్ జాతీయనేత రుద్రసంతోష్ జన్మదిన వేడుకలు

నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌకు వద్ద ఏఐసీసీ ఓబిసి జాతీయ కోఆర్డినేటర్ రుద్ర సంతోష్ జన్మదిన వేడుకలను ఆయన మిత్రమండలి సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని సంబరాలు నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆశీస్సులతో రుద్ర సంతోష్ కు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ టికెట్ ఇవ్వాలని ఈ ప్రాంత ప్రజలకు ఆయన అమూల్యమైన సేవలు అందించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రుద్ర మిత్ర మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love