ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

నవతెలంగాణ – రాయపర్తి
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎంపీడీఓ కిషన్ అన్నారు. సోమవారం మండలంలోని పెర్కవేడు గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో లక్ష్మీ ప్రసన్న గ్రమైఖ్య సంఘం వారిచే ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ రైతుల పండించిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరను రైతులు అందిపుచ్చుకోవాలన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి 2203, బి గ్రేడ్ ధాన్యానికి  2183, మద్దతు ధరను ప్రభుత్వం అందిస్తుంది అని వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు సైతం రైతులకు త్రాగునీరు, నిలువ నీడ ఏర్పాటు చేసి  టార్పాలిన్స్ ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం కిరణ్ కుమార్, సిసి దేవేంద్ర, సిఏలు రమాదేవి, మంగమ్మ, దివ్య, నిర్వాహకులు సుజాత, రాణి, మిల్లర్లు జాటోత్  హమ్య నాయక్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love