మిల్లుల వద్ద ధాన్యం త్వరగా అన్ లోడ్ చేయించాలి: పి.బెన్ షాలోమ్

నవతెలంగాణ – భువనగిరి
మిల్లుల వద్ద ధాన్యం త్వరగా అన్ లోడ్ చేయించాలని జిల్లా రెనిన్యూ అదనపు కలెక్టురు పి.బెన్ షాలోమ్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. గురువారం నాడు ఆయన కాన్ఫరెన్స్ హాలులో రైసు మిల్లుల ప్రతినిధులతో ధాన్యం కొనుగోళ్లను సమీక్షిస్తూ… మిల్లులకు ఇచ్చిన కెపాసిటీని పూర్తి చేయాలని, రైతుల నుండి కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుల శ్రేయస్సు దృష్టిలో వుంచుకొని మిల్లులలో స్పేస్ పెంచుకొని ధాన్యం లారీలను త్వరగా అన్ లోడ్ చేయించాలని, ఆ వెంటనే ఆన్ లైన్ నమోదు చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు జిల్లాలో 524 కోట్ల రూపాయల విలువ గల 2 లక్షల 39 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో సివిల్ సప్లయ్ జిల్లా మేనేజరు గోపీకృష్ణ, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాసరెడ్డి, జిల్లా రైస్ మిల్లుల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మల్లారెడ్డి, మిల్లుల ప్రతినిధులు పాల్గొన్నారు.
Spread the love