నీటి సమస్య పరిష్కారానికి హెల్ప్ లైన్

నవతెలంగాణ – భువనగిరి
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని త్రాగునీరు సక్రమంగా సరఫరా అయ్యేందుకు భువనగిరి పురపాలక సంఘ కార్యాలయం పట్టణ ప్రజలకు హెల్ప్ లైన్ సెంటర్ ను  సోమవారం  ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రామాంజనేయులు ఒక ప్రకటన విడుదల చేశారు ప్రస్తుతం భువనగిరి పురపాలక సంఘము పరిధిలోని అన్ని ప్రాంతాలలో త్రాగునీరు సరఫరా సక్రమంగా జరుగుతుందన్నారు. ప్రజలు నీటిని వృధా చెయ్యకుండా మెరుగైన రీతిలో వాడుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ కార్యాలయం టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. తాగునీటి సరఫరా లో ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తిన నంబర్ : 9398915335కు ఫోన్ చేయగలరని మున్సిపల్ కమీషనర్ కోరారు.
Spread the love