అపోలో కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలోని అపోలో ఒకేషనల్ జూనియర్ కళాశాలలో బతుకమ్మ పండుగను పురస్కరించుకొని కళాశాల ప్రిన్సిపాల్ గణేష్ వేముల అధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ..ఎక్కడైనా దేవుడిని పూలతో పూజిస్తారు కానీ మన తెలంగాణలో మాత్రమే పూలనే దేవతలుగా పూజించే గొప్ప సాంప్రదాయ పండుగ బతుకమ్మ పండుగ అన్నారు . తీరొక్క పువ్వులతో బతుకమ్మను అలంకరించి తొమ్మిది రోజులు పిల్లలు సంబరంగా, పెద్దలు సాంప్రదాయబద్ధంగా బతుకమ్మ వేడుకలను జరుపుకుంటారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బతుకమ్మ ఆట,పాటలతో తెలంగాణ ఆవిర్భావంలో బతుకమ్మ బాగస్వామి అయ్యిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఆధ్యాపకబృందం మమత, ప్రవీణ్, రాజేంద్ర ప్రసాద్, అఖిల ఆద్యాపేకతర బృందం శేఖర్, అరుణ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love