ఘనంగా బొమ్మ వెంకన్న వర్ధంతి వేడుకలు

నవతెలంగాణ – కోహెడ
మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకన్న వర్ధంతి వేడుకలను మండల కాంగ్రెస్‌ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎనలేని సేవలు చేసి, ఈ ప్రాంత ప్రజలలో చెరగని ముద్ర వేశారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఉపాధ్యాక్షుడు బస్వరాజు శంకర్‌, ఎస్సీ సెల్‌ ఉపాధ్యాక్షుడు గూడ స్వామి, కూరెళ్ళ గ్రామశాఖ అధ్యక్షుడు బండారి రవి, గాజుల వెంకటేశ్వర్లు, మంద కిష్టయ్య, మాజీ సర్పంచ్‌ మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Spread the love