నకిలి విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవు

నవతెలంగాణ – కోహెడ
నకిలీ విత్తనాలు అమ్మితే చట్టరీత్య చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీఏసీఎస్‌, అశ్విని, అగ్రోస్‌, గ్రోమోర్‌ ఫర్టిలైజర్‌ దుకాణాలలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైసెన్స్‌ డీలర్‌ తప్పకుండా 10 టన్నుల యూరియా ఉండేలా చూసుకోవాలన్నారు. అలాగే మెషిన్‌తోనె అమ్మకాలు జరపాలని, స్టాక్‌ బుక్‌, బిల్‌బుక్‌ ఉండేలా చూసుకోవాలని లేనట్లయితే 1985 చట్ట ప్రకారం సదరు డీలర్‌పై తగు చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం 500 ఎంటీ యూరియ ఉందని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం మండలంలోని వరికోలు గ్రామ వరిచేన్లను వ్యవసాయ శాస్త్రవేత్త విజయ్‌తో కలిసి పరిశీలించారు. వరిలో కాండం తొలుచు పురుగు ఉధృతి అధికంగా ఉందని దాని నివారణకు కార్బోఫ్యూరొన్‌ 3జీ గుళికలు 10కేజీ, వేప నూనె 1500పీపీఎం, 1లీటర్‌ లేనట్లయితే కార్టప్‌ హైడ్రోక్లోరైడ్‌ 2గ్రాములు లీటర్‌ నీటికి, వేప నూనె 1500 పీపీఎం ఒక లీటర్‌కి పిచికారి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి భోగేశ్వర్‌, విస్తరణ అధికారులు శివకుమార్‌, రూప, మహిపాల్‌, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love