అశ్వారావుపేటలో ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ వేడుకలు..

– హాజరైన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అర్జున్..
నవతెలంగాణ – అశ్వారావుపేట
కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడం కోసం ఐక్యత మరియు పోరాటం నినాదంతో ఏర్పడిన సీఐటీయూ కు 54 సంవత్సరాలు నిండింది అని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ అన్నారు.  హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో  సంఘం 54 ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని సమస్యల నుండి కాపాడడం, ఐక్య ఉద్యమాలను అభివృద్ధి చేయడంలో బలోపేతం చేయటంలో సీఐటీయూ అగ్రభాగాన నిలిచిందన్నారు. అనునిత్యం కార్మిక వర్గం యొక్క హక్కులు,  వేతనాలు,ప్రయోజనాలు పని పరిస్థితులు మెరుగుపరచడం కోసం విశేషమైన కృషి చేసిందని అన్నారు.శ్రామిక వర్గం ప్రాణాలర్పించిన పర్యవసానంగా సాధించుకున్న హక్కులు చట్టాలను పాలక ప్రభుత్వాలు  అమలు చేయడంలేదని,సమ్మె చేసే హక్కును సైతం ప్రశ్నార్ధకంగా ఉంది అన్నారు. పాలక ప్రభుత్వాలు తమ విధానాలు ద్వారా కార్మికులు జీవనోపాధిని దుర్బర పరిస్థితులు,క్రూరమైన దాడులకు గురవుతున్నారన్నారు. ప్రజలను విభజించడానికి,వారి ఐక్యతను భంగం కలిగించడానికి మితవాద శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ నరసింహారావు, ఏసు,రాంబాబు,రమేష్ నాగేంద్ర, ఖాసిం, తదితరులు పాల్గొన్నారు.
Spread the love