నవతెలంగాణ-నవాబు పేట
తెలంగాణ వీరుడు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవ పోరాట యోధుడు పండుగ సాయన్న ఆయన సేవలు మరువలేనివని లింగంపల్లి గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గోవిందుగారి నర్సింహులు అన్నారు. శనివారం లింగంపల్లి గ్రామంలో ముధిరాజ్ సంఘం కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల హక్కుల కోసం నిర్భయంగా పోరాడిన ఆయన త్యాగస్ఫూర్తి, ధైర్యసాహసాలు తెలంగాణ సమాజానికి చిరస్థాయిగా స్ఫూర్తినిస్తాయని అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, స్వాభిమానం కోసం ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శం అని కొనియాడారు. పండుగ సాయన్న జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు పెంటయ్య, చెన్నయ్య గోపాల్ జయరాములు, శేఖరయ్య వెంకటయ్య, పాండు, రఘు, సత్యయ్య, జంగయ్య కృష్ణయ్య రవి, నవీన్, శ్రీనివాస్, తిరుపతయ్య, రమేష్,శివ, రాజు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



