
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా తిరుమలగిరి పట్టణ, మండల వ్యాప్తంగా పలు కార్యాలయంలో ఘనంగా పతాక ఆవిష్కరణ గావించారు. తిరుమలగిరి మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ శాగంటి అనసూయ రాములు, జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ రాజ మోహన్ రావు, తాసిల్దార్ కార్యాలయంలో హరిప్రసాద్, ఎంపీడీవో కార్యాలయంలో లాజర్, హైస్కూల్లోప్రధానోపాధ్యాయులు దామెర శ్రీనివాస్, మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ కాంతి కిరణ్, కస్తూరిభా పాఠశాలలో ఎస్ఓ సుస్మిత, పోలీస్ స్టేషన్ కార్యాలయం ఎస్సై సురేష్, మార్కెట్ కార్యాలయంలో నాయకులు దానితోపాటు మండల వ్యాప్తంగా పలు పాఠశాలలలో పతాకావిష్కరణ గావించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. సామాన్యులే సాయుధులై రుణనాదం చేశారని, నిరంకుశ నిజాంపై గెరిల్ల పోరాటాలతో దండెత్తారని, కొడవళ్ళు, గొడ్డళ్లు, కారంపొడిలే ఆయుధంగా విరుచుకుపడ్డారు, నిజాం పాలకులను రజాకార్ల ను తరిమి తరిమి కొట్టారు, భారత యూనియన్ లో హైదరాబాద్ సంస్థానం విలీనం చేసేలా నిజాం నవాబ్ గుండెల్లో దడ పుట్టించారు, సెప్టెంబర్ 17న తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం. బండెనక బండి గట్టీ 16 బండ్లు గట్టి ఏ బండ్ల పోతావ్ కొడుకో నైజాం సర్కారోడా కూడా అంటూ తిరగబడ్డారు తెలంగాణ జనం. భాంచంద్ దొర అంటూ సలాం కొట్టిన చేతుల్ని ఆయుధాలుగా ప్రయోగించారు. సమిష్టిగా సాయుధలై సమర శంఖం పూరించారు. నాటినుండే హైదరాబాద్ భారత ప్రభుత్వంలో విలీనమైన రోజున రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైందని అందుకే సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్సోజు నరేష్, సుంకరి జనార్ధన్, కందుకూరి లక్ష్మయ్య, మూల అశోక్ రెడ్డి, కౌన్సిలర్లు భాస్కర్ నాయక్, బత్తుల శ్రీను తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, కళాశాల, పాఠశాల ప్రిన్సిపాళ్ళు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.