75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా టిఎన్జీవో జిల్లా కార్యాలయం ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జిల్లాలో గల అధికారులకు ఉద్యోగులకు శ్రేయోభిలాషులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు శుక్రవారం తెలియజేశారు. ప్రతి ఉద్యోగి పౌరులు అందరు రాజ్యాంగ పరిరక్షణ కొరకై పాటుపడాలని ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ , టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు అలుక కిషన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ , టీజీవో జిల్లా అధ్యక్షులు సంఘం అమృత్ కుమార్, సహాధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి, కేంద్ర బాధ్యులు, టిఎన్జీవో జిల్లా కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.