ఘనంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు

నవతెలంగాణ- నూతనకల్
మండల కేంద్రంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సర్పంచ్ తీగల కరుణశ్రీ గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు అత్యంత ఘనంగా శనివారం నిర్వహించారు. అత్యధిక సంఖ్యలో యువతులు, మహిళలు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీకి సహకరించిన దాతలకు సర్పంచ్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్య అతిధులుగా చురకంటి శ్యాంసుందర్ రెడ్డి , యాస ముత్తా రెడ్డి ,ముత్యం ప్రసాద్, గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. పోటీలో గెలిచిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. న్యాయ నిర్ణేతలుగా చురకంటి సుమతి, చురకంటి శశికళ, పగిల్ల ప్రమీల, మేడిపల్లి శ్రీను వ్యవహరించారు. మొదటి బహుమతి జటంగి స్వప్న, రూ.3016, శ్రీ దేవిరెడ్డి రామ్ రెడ్డి జ్ఞాపకార్థం,  దాత(వారి మనుమడు దేవి రెడ్డి చంద్రాశేఖర్ రెడ్డి),
రెండో బహుమతి పొన్నం సింధుజ రూ. 2516, శ్రీ బండి వెంకన్న జ్ఞాపకార్థం దాత (కుమారులు అనిల్, మహేష్ ,మధు) , మూడో బహుమతి యాస నిత్య రూ.2016, (శ్రీ మహాలక్ష్మి సిమెంట్ &ఐరన్ మార్చంట్ దాత (శ్రీ తీగల శ్రీధర్ రెడ్డి) బహుమతి గిలకత్తుల స్వాతి,రూ.1516 (శ్రీ బండపల్లి ముత్తయ్య జ్ఞాపకార్థం) దాత కుమారుడు బండపల్లి చంద్రు, ఐదో బహుమతి బూడిద శైలజ,రూ.1016(శ్రీ సాబాది రామ్ రెడ్డిజ్ఞాపకార్థం(దాత వారి కుమారుడు శ్రీ సాబాది అశోక్ రెడ్డి )ఈ ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలకు, బాలికల కు ప్రత్యేక బహుమతులు ఇవ్వటం జరిగింది. ప్రత్యేక బహుమతి దాతలు మెట్టు కృపాకర్,మారగని వెంకన్న, కొల్లు హనుమంత రెడ్డి,సాబాది వాసుదేవరెడ్డి,వీరమళ్ళ నర్సయ్య ప్రజలు పాల్గొన్నారు.

Spread the love