ఘనంగా బక్రీద్ వేడుకలు..

– జాతీయ పతాకం పోలిన దుస్తులతో జాతీయత ప్రదర్శన..
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండల వ్యాప్తంగా సోమవారం ముస్లిం సోదరులు బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రతి ముస్లిమ్ సోదరుల ఇంట్లో పండుగ వాతావరణం నెలకొన్నది. అశ్వారావుపేట – సత్తుపల్లి రహదారిలో  స్థానిక పామాయిల్ పరిశ్రమ ఎదురుగా ఉన్న ఈద్గా లో ముస్లిమ్ సోదరులు అదిక సంఖ్యలో చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ముస్లిమ్ మృతి పెద్ద సదర్  ఖురాన్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు.అనంతరం స్నేహితులు,బంధువులతో కలసి ఇంటివద్ద సిద్ధం చేసిన రుచికరం సేమియా లన సేవించారు. సాయంత్రం విందు భోజనాలు భుజించారు. ప్రార్ధన సమయంలో ముగ్గురు సోదరులు జాతీయ పతాకం త్రి వర్ణం పోలిన దుస్తులు ధరించి జాతీయతను ప్రదర్శించారు.మేమూ ఈ పవిత్ర నేల పై పుట్టీ పెరిగిన భారతీయ సంతతి వారం మే అని హర్షాతిరేకాలు వెలిబుచ్చారు.
Spread the love