నవతెలంగాణ – పెద్దవూర
మండలం లోని పులిచెర్ల జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణంలో ఉన్నటువంటి నీటి బోరు లో 1800 శాతం టిడీఆర్ ప్లారిన్ శాతం చాలా ఎక్కువగా ఉన్నందున, అవి ఉప్పుగా ఉండడం తోనీరును విద్యార్థులు త్రాగలేక పోతున్నారు.గ్రామపంచాయతీ నుండి కూడా పాఠశాలకు మంచి నీటి సౌకర్యం లేనందున భోజన సమయంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.ఇట్టి సమస్య పరిష్కరించే దిశగా పాఠశాల అభివృద్ధి కమిటీ మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం అందరం కలిసి శుక్రవారం పులిచర్ల గ్రామం లో వున్నఎస్బీ ఐ బ్యాంక్ మేనేజర్ సంప్రదించారు.మా గ్రామ పాఠశాలలో విద్యార్థుల త్రాగునీటి కోసం సోషల్ వెల్ఫేర్ కార్పరస్ ఫండ్ ద్వారా ఒక ఆర్వో నీటి ప్లాంటును,ఫిల్టర్ వాటర్ ప్లాంట్, ను ఏర్పాటుకు అభ్యర్థించారు.అందుకు బ్యాంక్ మేనేజర్ సానుకూలంగా స్పందించారని పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు.బ్యాంకు ఉన్నతాధికారులను సంప్రదించి సుమారు 2,50,000 రూపాయల విలువ గల ఆర్వో మంచినీటి ప్లాంటు ఏర్పాటుకు ప్రయత్నం చేస్తానని మేనేజర్ హామీ ఇచ్చారని తెలిపారు . ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుదర్శన్,పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు బుడిగపాక సత్యనారాయణ, బొడ్డుపల్లి చిరంజీవి,ముని నాయక్,ఉపాధ్యాయులు నర్సిరెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు.