
గృహలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న నిరుపేదలందరికీ గృహలక్ష్మి పథకం అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు జెల్ల అజ్జు యాదవ్ అన్నారు. గృహలక్ష్మి పథకం కోసం నిరుపేదలు దరఖాస్తు చేసుకున్న వారికి గృహలక్ష్మి పథకం రావడం లేదని, వెంటనే పారదర్శకంగా ఎంపిక చేసి ప్రొసీడింగ్ పత్రాలను అందించి పేదలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.