రాష్ట్రంలో పదేండ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వా నికి ప్రజలు పట్టం కట్టారు. ఎన్నికల మేనిఫేస్టోలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలులో భాగంగా మహిళల ఉచిత బస్ ప్రయాణం ఈ నెల 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ప్రారంభించారు. ఇది పేద మహిళలకు ఒక వరం. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన రెండురోజుల్లోనే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించడం అభినందించదగినది. అయి తే ఉచిత ప్రయాణ పథకాన్ని ఒక్క ప్రాంతంలో ”పైలట్ ప్రాజెక్టుగా” ప్రారంభించి ఎదురయ్యే సమస్యలను రవా ణాశాఖ ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి విధివిధా నాలను రూపొందించి రాష్ట్రమంతా అమలు చేస్తే బాగుండేది. దేశంలో మొట్టమొదటిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించిన రాష్ట్రం తమిళ నాడు. తమిళనాడు రవాణాశాఖ అక్కడి మహిళల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి సరైన విధి విధానాలను రూపొందించి స్టాలిన్ ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. అదే భాటలో కర్నాటక ప్రభుత్వం ప్రయ త్నం చేసినప్పటికీ అమలు చేయడంలో కొంత వైఫల్యం చెందిందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణ రవాణా శాఖ ఎప్పటికప్పుడు ఉచిత ప్రయాణంలో వచ్చే సమస్యలను అధ్యయనం చేయకపోతే ఈ మహ త్తరమైన పథకం నీరుగారే అవకాశముంది. రాష్ట్రంలో ఈ పథకాన్ని ప్రారంభించి వారమే అవుతున్నా మహి ళల ఆదరణ పొందింది. కానీ ప్రయాణించే ప్రయాణి కులకు అసౌకర్యంగా కూడా మారింది. ఏ బస్సులో అయినా కిక్కిరిసిన జనంతో బస్సులు నడుస్తున్నాయి. దీనివల్ల బస్సులకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. అసలే బస్సుల కొరత ఉన్న రాష్ట్రంలో కొత్త బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టాలి. అలాగే జీరో టికెట్ ద్వారా స్మార్ట్ కార్డులను ప్రతి మహిళకు అందించి మార్గ దర్శకాలు రూపొందించాలి. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగ డంతో ప్రభుత్వంపై అధిక భారం పడే అవకాశం ఉంది. గనుక ఈ పథకాన్ని ఎలక్ట్రిసిటీ బస్సులనూ నడపడం ద్వారా కొంతవరకు ప్రభుత్వంపై అధిక భారాన్ని తగ్గించవచ్చును. అలాగే ఉచిత బస్సుల ప్రయాణంతో ఆటో వాలాలు రోడ్డున పడ్డారు. వారి బతుకులు ఆగం కాకుండా కుటుంబా లను ఆదుకునేలా కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాలి. అప్పుడే రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం విజయవంతమవుతుంది.
– రాచకొండ విగేష్, 6302246641