ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి..

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
సావిత్రిబాయి పూలే 127వ, వర్ధంతి కార్యక్రమని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చలమల్ల నర్సింహ, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాసరావులు అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎం జి రోడ్డులోని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని తెలిపారు. ఒక్క స్త్రీ విద్యావంతురాలు అయితే తన సంతానానికి విద్యను అందించడం ద్వారా కుటుంబం విజ్ఞానవంతులై,అభివృద్ధి చందుతారని ఆమె విద్య బోధనలు చేశారని అన్నారు. మహిళలకు విద్య నేర్పిస్తే గ్రామం జిల్లా రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుందని భావించి మహాత్మా జ్యోతి రావు పూలే తన సతీమణి సావిత్రిబాయి పూలే కి విద్య నేర్పించి భారతదేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలును చేశారన్నారు.వితంతువులకు పున:వివాహాలను జరిపించిన గొప్ప సంఘకర్త సావిత్రిబాయి పూలే, అని కొనియాడారు.అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలవారి కోసం తన భర్త జ్యోతిరావు పూలే తో కలిసి స్వంతంగా అనేక పాఠశాలు హాస్టల్లను వైద్యశాలలను  స్థాపించి విద్య, వైద్యాన్ని వసతిని కల్పించి సమానత్వాన్ని తీసుకొచ్చి స్త్రీల అభివృద్ధికి పాటుపడ్డారు అని అన్నారు.చివరి శ్వాస వరకు ప్లేగు వ్యాధిగ్రస్తులకు ఉచితంగా వైద్యo, మందులు, ఆహారం అందిస్తూ చివరి రక్తపు బొట్టు ఉన్నంతవరకు సేవలు చేస్తూ అదే ప్లేగు వ్యాధితో 1897 మార్చి10వ తేదీన తుది శ్వాస విడవడం జరిగిందని అన్నారు. నేటి సమాజం ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని వారి ఆశయ సాధన కొరకు కృషి చేయాలని కోరారు.సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే జీవితం చరిత్రను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠ్యాంశంలో చేర్చి వారి చరిత్రను భావితరాలకు తెలియజేయాలని అన్నారు. సూర్యాపేటలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలకు సావిత్రిబాయి పూలే పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి నారాయణ గౌడ్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తలమల్ల హసేన్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నిద్ర సంపత్ నాయుడు, బీసీ నాయకులు పిషిక వీరయ్య, కందాల భాస్కర్,పేరూరి రమణ, బైరు విజయకృష్ణ, మట్ట రమేష్ యాదవ్,దాసరి వెంకన్న యాదవ్, యలగందుల సుదర్శన్, తన్నీరు వాసుదేవ్, జంపాల వెంకటేశ్వర్లు, మంతాపురంవెంకటేశ్వర్లు, పున్న వెంకన్న నేత, చలమల్ల యశ్వంత్ కుమార్,కేతం వెంకటేశ్వర్లు,పగిళ్ల వెంకన్న,తండు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Spread the love